Hi Friends,
I am very much passionate to write short poems(కవితలు ). These are some of the poems i have written ::::::
First one is about అమ్మ
పిల్లలే ప్రాణంగా ,ఊపిరిగా
పిల్లలే ధ్యేయంగా,ధ్యానంగా
వాళ్ళ ఆనందమే తన ఉత్సాహానికి మూలంగా
వాళ్ళ ధరహాసాలే తన జీవిత లక్ష్యంగా
వారి ఉన్నతికి ప్రేమ శిఖరాలు నిర్మించే
వారి విజయాలకు విజయ భేరీలు మ్రోగించే
వారి ప్రగతిని అనుక్షణం కాంక్షించే
వారి కోసమే పరితపిస్తూ జీవించే
తల్లి కన్న ప్రేమకు ,తల్లికున్న ప్రేమకు ,తల్లి అన్న మాటకు
విలువెంతని ప్రశ్నిస్తే ???????
పాలలోని తెల్లదనం ఎంతో
విరిసే పూల అందం ఎంతో
పొంగి పొరలే అలల చప్పుడు ఎంతో
వీచే గాలి స్వచ్చత ఎంతో
సూర్యుడి వెలుగుల కాంతి ఎంతో
రంగు రంగుల ప్రకృతి సోయగం ఎంతో
పసి పాపల కేరింతల వుబలాటం ఎంతో
కొలవలేనిది, వెలకట్టలేనిది తల్లి ప్రేమ
Next one is about ప్రేమ
మాటలలో చెప్పలేనిది.....మౌనంగా వుండనీయనిది
చేతలలో చూపలేనిది.....ఏమి చేసినా తనివి తీరనిది
క్షనమునే యుగము చేసేది.....క్షణమైనా గడవనీయనిది
గుండె చప్పుడు మించిపోయేది.....గుండెని పిండి వేసేది
ఏ రూపమైన నేను చూసేది......తన రూపమే గుర్తుచేసేది
ఇన్ని భావాలు కలిగించేది.....ఎలా పిలిచినా బాగుంది అనిపించేది
రెండే అక్షరాలైనా ఎంతో అర్దానిచ్చేది......ఈ లోకాన అందరికీ నచ్చేది
ప్రేమ
This one is dedicated to my lovely sister SUSEELA
బ్రతుకు భారంగా నడిచినా
లేక సంబరంగా గడిచినా
కదిలే ప్రతిక్షనంలో నువ్వున్నావ్ .....
తీయని సుఖాల్లో తేలినా
తీరని దుఖాల్లో మునిగినా
మిగిలే ప్రతీ అనుభవంలో నువ్వున్నావ్ .....
కదలకుండా పనిచేస్తున్నా
కలలు కంటూ నిద్రపోతున్నా
మెదిలే ప్రతీ ఆలోచనలో నువ్వున్నావ్ ........
మెత్తగా మంచు కురిసినా
జోరుగా వర్షం తడిపినా
వచ్చే ప్రతీ ఋతువులో నువ్వున్నావ్ .........
నాలుగు గోడల మధ్య వున్నా
నలుగురిలో తిరుగుతున్నా
వెళ్ళే ప్రతీ మూలలో నువ్వున్నావ్ ...........
పచని తోటల్లో విచ్చినా
పిచ్చి మొక్కలలో పుట్టినా
పూసే ప్రతీ పూవుల్లో నువ్వున్నావ్ .........
వెండి వెన్నెల్లో నడుస్తున్నా
మండే ఎడారుల్లో ఈడుస్తున్నా
వేసే ప్రతీ అడుగులో నువ్వున్నావ్ ...........
Monday, August 18, 2008
My Poetry
Posted by Ananth at 3:35 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment