నాకు ఎంతగానో నచ్చిన కొన్ని వాక్యాలు ఇక్కడ రాస్తున్నాను :::::::
నిన్నకి నిజాయితి లేదు,నేడుకి నిలకడ లేదు,రేపుకి రూపు లేదు
పిల్లలకి ప్రేమ కావాలి,పెద్దలకి పరువు కావాలి,ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి అంటే ఎవరో ఒకరు compromise అవ్వాలి
ప్రేమించిన మనిషి మోసం చేయచ్చు,కాని ప్రేమించిన మనసు మోసం చెయ్యదు ..మోసం నీది,మనసు నాది
అబద్ధం చెప్పాల్సిన అవసరం లేనప్పుడు నిజం చెప్తే తప్పు లేదు
ఎంత మందిలో వున్నా,నువ్వు ఎంతటి వాడివైన..అమ్మ తిడితే అవమానం అనుకోకు, ఆశీర్వాదం అనుకో
సాయం చేసిన వాడిని, మోసం చేసిన వాడిని ఎప్పటికి మర్చిపోకు... సాయపడిన వాడిని దీవిస్తూ వుండు, మోసం చేసిన వాడిని క్షమిస్తూ వుండు
సాధించిన విజయాలన్నింటిని తలచుకుని వుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఖాలిగా వున్నావు అని అర్ధం
కోయిల అరిచినా పాట అనుకుంటాము,కాకి పాడినా అరుపు అనుకుంటాము ...కాకి పాటని కూడా గుర్తించండి,కళ ఎక్కడున్నా ఆదరించండి
గొప్పవాడు విమర్శల కోసం చూస్తాడు,గొప్ప అవ్వాలి అనుకునే వాడు పొగడ్తల కోసం చూస్తాడు
చెమట ఉప్పగా వుంటుంది,కాని అది అందించే గెలుపు తియ్యగా వుంటుంది
కథ అన్నాక ముగింపు వుండాలి,మనిషి అన్నాక తెగింపు వుండాలి
నువ్వు నిద్రపోయేటప్పుడు వచ్చే కల నిజం కావొచ్చు ...కాని నువ్వు మేలుకున్నపుడు కనే కల ఎప్పుడు అబద్ధం కాకూడదు
ప్రేమించే మనిషికి ద్వేషం అంటే ఏమిటో తెలియదు,ద్వేషించే మనిషికి అసలు జీవితం అంటేనే ఏమిటో తెలియదు
అదృష్టానికి కష్టం అంటే ఇష్టం...నువ్వు కష్టాన్ని ఇష్టపడు...అదృష్టం నిన్ను ఇష్టపడుతుంది
జీవితం రోజు లాంటిదైతే ...అందులో ప్రేమ ఒక రాత్రి...కొందరికి వెన్నెల పంచితే...మరి కొందరికి అమావాస్యనే మిగిలుస్తుంది...అలాగని ఆ రాత్రితో అంతమవ్వదు...ఎప్పటికి మన కోసం ఒక కొత్త ఉదయం(హృదయం) ఎదురు చూస్తుంది
భవిష్యత్తు మీద ఆశ నీకు ఒక దారి చూపిస్తుంది...కాని నీలో పట్టుదల మాత్రమే ఆ దారిలో నిన్ను విజేతని చేస్తుంది...అందుకే, మనిషికి కావాల్సింది గోరంత ఆశ ... కొండంత పట్టుదల
ప్రేమ ఉండాల్సింది పొదల్లో కాదు ఎదల్లో
సూర్యుడు చీకటితో పోరాడగలడు,చీకటిలో పోరాడలేడు,కాని నేను రెండు చెయ్యగలను
మా అమ్మ MISS UNIVERSE కాకపోవచ్చు...కాని తనంత అందమైన మనిషిని నేనింత వరకు చూడలేదు
అలకలో తన కోపం చూడకు,బ్రతిమాలుకుంటాడు అనే నమ్మకం చూడు
young age లో engagement కన్నా...later age లో love కన్నా...middle age లో marriage మంచిది
ఊహలు నా నేస్తాలు,ఆలోచనలు నా బంధువులు,రాతలు నా తీపి గుర్తులు
దారం తెగిన గాలి పటాన్ని,భారంగా మారిన నా మనసుని...చూస్తూ కూర్చోవటం తప్ప అమి చెయ్యగలను ?
కనులకి అలసట తీర్చేది నిద్ర అయితే...కలలకి అలసట తీర్చేది మరణం
Trigger ఫై వున్న వేలు తను,gun తో గురి చూసేది నా హృదయాన్ని...నొక్కితే ఏమవుతుందో తనకి తెలియదు,తనను విడిచి వెళ్ళడం నాకు తెలియదు
దాహపు మంటలనార్పేది చన్నీల్లైతే..
గుండెల మంటలనార్పేది కన్నీళ్లు.
సముద్రపు లోతుని అడుగులతో కొలిస్తే...నా కష్టాలని కన్నీటితో కొలవాలేమో!!!
కడుపు నిండిన వాడికి మెదడు పనిచెయ్యదు...జేబు నిండిన వాడికి మనసు పనిచెయ్యదు
మనసు అనే బావిలో స్నేహం అనే తాడు వేసి నీళ్ళను తోడాలి
నిజం నీరులాంటిది...నీతి అనే లోతు ఎటు వుంటే అటే ప్రవహిస్తుంది
దారి చూపటానికి అర్హత వుండాల్సిన అవసరం లేదు,ఆలోచన వుంటే చాలు
అందం ఆకర్షించటానికి పనికొస్తుందేమో కాని అర్థం చేసుకోవడానికి పనికి రాదు
దేవుడా ప్రత్యక్షం అవ్వవయ్యా అంటే ప్రతిపక్షం అయ్యావా?
కూరలో కారం ఎక్కువైనా,మాటలో వెటకారం ఎక్కువైనా...మొదటిది తినడానికి రెండోది వినటానికి కష్టంగా వుంటుంది
పూసే ప్రతి పువ్వు వికసించదు...నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు
కొన్ని జ్ఞాపకాలు మనిషిని బతికిస్తాయి...కొన్ని జ్ఞాపకాలు మనసుని చంపేస్తాయి
దేవుడు మనం తప్పులు చేస్తే శిక్షిస్తాడు,మంచి పనులు చెయ్యాలనుకుంటే పరీక్షిస్తాడు,అంతే కాని జీవితంలో ఎప్పుడు కష్టాల పాలు చెయ్యడు
class లో కూర్చుంటే attendance వస్తుంది...ఖాళీగా కూర్చుంటే కవితలు వస్తాయి...నీ కోసం కూర్చుంటే నీరసం తప్ప ఏమి రాదు
ప్రేమ ప్లాస్టిక్ పువ్వులాంటిది ఎప్పటికి అందంగానే వుంటుంది . కానీ అందం మామూలు పువ్వు లాంటిది . కాలంతో పాటు వాడి పోతుంది .
ప్రేమని మొదలుపెట్టింది నేను...నన్ను వదిలిపెట్టింది తను
వేగంగా పరిగెత్తే వాడు ఒంటరిగా పరిగెడుతూ వుంటాడు....race లో అయినా life లో అయినా
నాకు సాయం చేస్తే నీకు పుణ్యం వస్తుంది,అంతే కాని నా మీద హక్కు రాదు
బద్ధకం,నిర్లక్ష్యం కొంత పని కూడా చేయనివ్వవు....కాని ఆకలి,ప్రేమ ఎంత పనైనా చేయిస్తాయి
బాధని చెప్పక పోతే పిరికి వాడు అంటారు...చెప్తేనేమో కవి అని అంటారు ...మరి నన్ను ఏమి చెయ్యమంటారు
ప్రేమించే పిల్ల,సముద్రపు అల రెండూ ఒకలాంటివే...ఎప్పుడు ఎగిరి పడతాయో తెలియదు,రెండూ నిన్ను ముంచేస్తాయి
అమ్మ దగ్గర అన్నం దగ్గర ఎప్పుడూ తల వంచుకునే వుండాలి
చెప్పలేని ప్రేమ నాది...ప్రేమ లేని చూపు నీది
ఓటమి ఎరుగవు అంటే గెలుపులోని తియ్యదనం పూర్తిగా తెలియదు అని అర్ధం
నా వ్యాపకమే నువ్వు అవుతావు అనుకున్నా ,ఇలా జ్ఞాపకం అవుతావు అనుకోలేదు
మన పనికి ఎంత మంది వస్తే ఏమిటి లాభం,వాళ్ళు మనకి పనికిరావాలి
అవకాశాన్ని చూస్తూ వుంటే దాన్ని సొంతం చేసుకున్న వాడిని కూడా చూడాల్సి వస్తుంది,దాన్ని చేజిక్కిన్చుకుంటే లోకం మొత్తం నిన్ను చూస్తుంది
మొదటి అడుగు అమ్మతోనే...ముందడుగు స్నేహితునితోనే,కాని తప్పటడుగు మాత్రం అమ్మయితోనే వేస్తారు
బాధలో వున్న వాడిని ఆదుకోవాలి...బాధను పెట్టే వాడిని ఆడుకోవాలి
అమ్మ ప్రేమలో మమకారం...నాన్న ప్రేమలో నమ్మకం...కాని అమ్మాయి ప్రేమలో ఈ రెండు ప్రేమల అమ్మకం
మగవాడి గెలుపు వెనక ఆడది వుంటుంది
ఈ మాటని సరిగ్గా గమనిస్తే ఇలా వుంటుంది:
గెలిచిన మగవాడి వెనుక ఆడది వుంటుంది(పడుతుంది)
ప్రేమలో పాడినవాడు నూతిలో కప్పు లాంటి వాడు...వర్షం పడితే కాని కప్పలు బయటకి రావు,కన్నీళ్లు వస్తే కాని ప్రపంచం కనిపించదు
నీ కన్ను నేటిని చూస్తుంది
నీ మనసు నిన్నటి గురించి ఆలోచిస్తుంది
నీ చేతులు రేపటిని మలుస్తాయి
అయినా అన్ని నీ దగ్గరే ఉంచుకుని ఇంకా రాతలను గీతలను నమ్ముతావా?
"అర్ధం కాని దానిలోనే అందం వుంది "అనే సూత్రాన్ని దేవుడు నమ్మి అమ్మాయిలను పుట్టించాడు కాబోలు
ఓటమి,స్నేహితుడు...ఈ రెండూ , మనం తప్పు చెయ్యడం కాదు ఆ తప్పు నుంచి ఏమి నేర్చుకోకపోవడం అసలైన తప్పు అని గుర్తుచేస్తాయి
ధైర్యం అంటే నిలబడి వోడిపోవటం కాదు...ఓడిపోయినా కూడా నిలబడటం
మదిని నమ్మని వాడు విధిని....జీవితాన్ని నమ్మని వాడు జాతకాన్ని నమ్ముతారు
మనిషి స్పందించడం మాట అయితే...మనసు స్పందించడం కవిత అవుతుంది
ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి ధైర్యం కావాలి,ధైర్యం కావాలంటే నేను ప్రేమించిన అమ్మాయి పక్కనే వుండాలి
వయసు అయిపోతే ఆటలు ఆడటం మానెయ్యాలి అనుకుంటారు,ఆడటం మానేస్తే వయస్సు అయిపోతుందని తెలుసుకోరు
రెండు కళ్ళు మాట్లాడుకుంటే ప్రేమ పుడుతుంది ...
రెండు మనసులు మాట్లాడుకుంటేనే అది నిలబడుతుంది ...
కష్టాల్లోంచి పుట్టాల్సింది కన్నీళ్లు కాదు ...కసి
ఎప్పుడు పరిగేడుతూనేవుంటే ఎక్కడికి చేరం...ఎందుకంటే గమ్యం చేరాలనుకున్న చోటైనా ఆగాల్సిందేగా
వాన జల్లులో కన్నీరు మాయమవుతుంది,కాల గమనంలో నా ఈ కష్టం కనుమరుగవుతుంది
ఉరి తీసేవాడికి చివరి కోరిక వుంటుంది...ప్రేమలో వోడిపోయిన వాడికి ఉరే చివరి కోరిక అవుతుంది
కొన్ని జ్ఞాపకాలు గుండెపై రాసుకోవాలి...కొన్ని జ్ఞాపకాలు చెరిపేసి గుండెను రాయ చేసుకోవాలి
ప్రేమించడం తప్పు కాదు...ఆ ప్రేమ మించడం తప్పు
విడిపోవడానికి వున్న ఒకే ఒక దారి వీడి పోవడం...అంతే
నేను గతాన్ని తవ్వా...తను ప్రేమను పూడ్చి పెట్టింది
ప్రేమించా అన్నప్పుడు ఎప్పుడు అని...వదిలేసా అన్నప్పుడు ఎందుకు అని అడగకూడదు...మొదటి దానికి నా దగ్గర,రెండో దానికి తన దగ్గర సమాధానాలు లేవు
ప్రేమ కళ్ళతో మొదలై కన్నీళ్ళతో అంతం అవ్వకూడదు
స్నేహితుడు అంటే చెట్టుని కాసే వేరులా వుండాలి కాని చెట్టుని కూల్చే ఏరులా వుండకూడదు
ప్రేమించే వారికే ప్రేమను ఆశించే హక్కు వుంటుంది
కలిసి బ్రతుకు పంచుకుంటాము అనుకున్నాను, కాని ఇలా బాధ పంచుకుంటాము అనుకోలేదు
నేరం చెయ్యకుండా శిక్ష పడింది అంటే ప్రేమించావు అని అర్ధం